“ఓజి” పై పవన్ కామెంట్స్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన సుజీత్ నిర్మిస్తున్న చిత్రం OG . ఈ చిత్రంపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి మాంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన దృష్టి అంతా తాను తీసుకున్న శాఖలపై పూర్తి సమయం కేటాయిస్తున్నారు. అయితే ఆయన తాజాగా నిన్న జరిగిన పిఠాపురం బహిరంగ సభలో ఓజి చిత్రం పై చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఓజి చూద్దురు గానీ, బాగుంటుంది అంటూ పవన్ అభిమానులని ఉద్దేశించి చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.
For More Updates Follow The Film Nagar