భారతీయుడు 2 .. ఇలాంటి టాక్ వస్తోందేంటి?
శంకర్ మరియు కమల్ హాసన్ కాంబోలో రూపొందిన భారతీయుడు 2 చిత్రం 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా విడుదలైంది. ఈ చిత్రం నేడు (జూలై 12) విడుదల అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో షోలు పడటంతో టాక్ బయటకు వచ్చింది. ఈసారి సేనాపతి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడా లేదా అన్నది చూడాలి.
కమల్ హాసన్ విక్రమ్ సినిమా తర్వాత మళ్లీ ఫాంలోకి వచ్చాడు. కానీ, శంకర్‌కు హిట్ కొట్టడం చాలా కాలమే అయింది. రోబో అతని చివరి హిట్. ఆ తర్వాత నుంచి ఆయనకు హిట్లు అందటం లేదు. శంకర్ పై చాలా ఆరోపణలు ఉన్నాయి. ట్రెండ్‌కి తగ్గట్టుగా సినిమాలు తీయలేకపోతున్నాడు అని, అవుట్ డేటెడ్ సినిమాలు చేస్తున్నాడని విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడీ భారతీయుడు 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్, పాటలు బాగా ఆకట్టుకోలేదు. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలోకి వచ్చింది.
ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్‌గా ఉందని, ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకోలేదని, అవుట్ డేటెడ్‌గా ఉందని అంటున్నారు. కొన్ని సీన్లలో మేకప్ కూడా తేలిపోయిందని, ఎమోషన్, డ్రామా వర్కౌట్ కాలేదని అంటున్నారు. కమల్, సిద్ధు బాగానే నటించారని చెబుతున్నారు.
శంకర్ గారు తన ఆస్థాన రచయిత సుజాత గారిని మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఆయన కాలం చేశాక శంకర్ చిత్రాలు గట్టిగా ప్రభావితం కాలేదని నెటిజన్లు భావిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్‌గా ఉందని, విజువల్ గ్రాండియర్, అనిరుధ్ సంగీతం బాగుందని, కానీ శంకర్ అవుట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో విసిగించాడని అంటున్నారు.
భారతీయుడు 2 సినిమా ఇంపాక్ట్ లేని, డ్రాగ్డ్, బోరింగ్, అవుట్ డేటెడ్‌గా ఉందని అంటున్నారు. సిద్ధార్థ్, కమల్ హాసన్‌లకు తక్కువ స్క్రీన్ టైం దొరికిందని, శంకర్ అవుట్ డేటెడ్ అనిపించింది అని చెబుతున్నారు.
మూవీ ఎత్తుకోవడం బాగానే ఉన్నా, ముందుకు సాగిపోతున్న కొద్దీ ఊహకందేలా సాగుతూ బోరింగ్‌గా అనిపిస్తుంది. నో గ్రిప్పింగ్, నో ఎగ్జైట్మెంట్ అని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ ఇలా ఉందంటే, సెకండాఫ్ ఎంతో బాగుండాల్సి ఉంటుంది అని అంటున్నారు. కమల్ హాసన్ నటన పీక్స్‌లో ఉందని, శంకర్ మార్క్ మిస్ అయ్యిందని, సిద్ధార్థ్, రకుల్ నటన బాగుందని అంటున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు బాగున్నాయని చెబుతున్నారు.
శంకర్ హిట్ కొట్టాడని కొందరు అనుకుంటున్నారు కానీ, మిక్స్డ్ టాక్ వస్తోంది. శంకర్ తీసిన వరస్ట్ సినిమా ఇదే అవుతుందని కొందరు భావిస్తున్నారు.
ఈ సినిమాను లైకా సంస్థ, రెడ్ జెయింట్ సంస్థ కలిసి భారీ ఎత్తున నిర్మించాయి. కమల్ హాసన్, సిద్దార్థ్, బాబీ సింహా, ఎస్ జే సూర్య, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ వంటి ప్రముఖులు నటించారు. ఇలాంటి చిత్రానికి ఇంత నెగెటివ్ టాక్ రావడం దురదృష్టకరం.
For More Updates Follow The Film Nagar