EXCLUSIVE UPDATE: అక్టోబరు నుంచి ‘ఓజీ’
జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి గానే కాకుండా మంత్రిగా బాధ్యతలతో పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేశారు. ప్రొడ్యూసర్స్ కూడా పవన్ పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. పవన్ కొన్నాళ్ల పాటు తన శాఖలపై పట్టు సాధించాలనే ఉద్దేశ్యం తో ఆ పనుల్లోనే ఉంటూ అధికారులతో వరుస భేటీలతో చాలా బిజీ గా ఉన్నారు, ప్రజలకు ఎంతో కొంత మంచి చేసిన తరవాతే సినిమాలపై దృష్టి పెడ్తా అని పవన్ కళ్యాణ్ గారు ఇదివరకే పిఠాపురం భహిరంగ సభ లో చెప్పారు ఇప్పుడు అదే చేస్తున్నారు కూడా. ఇప్పుడు వీలు చూసుకుని సినిమాలపై దృష్టి పెట్టబోతున్నారు. అక్టోబరు నుంచి ఓజీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇన్ సైడ్ వర్గాల సమాచారం. తొలుత ఆయనఓజీ పూర్తి చేస్తారని అందుకే ‘ఓజీ’ కోసం ప్రత్యేకంగా కాల్షీట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇటీవలే నిర్మాత దానయ్య పవన్ కల్యాణ్ ని కలిసారని ఈ సందర్భంలో ఓజీ పూర్తి చేయడానికి పవన్ తన సముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ కోసం కూడా ఈ యేడాదిలోనే పవన్ కొన్ని డేట్లు ఇవ్వబోతున్నారు. అయితే.. పూర్తి ఫోకస్ మాత్రం 2025లోనే. ముందు ‘ఓజీ’ పూర్తి చేసి, ఆ తరువాత ఉస్తాద్‌ని మొదలెడతారు. దానికి తగ్గట్టుగానే హరీష్ శంకర్ తన తదుపరి సినిమాల ప్లానింగ్ చేసుకొంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ కూడా పవన్ పూర్తి చేయాల్సివుంది. అయితే ఓజీతో పాటు ‘వీరమల్లు’ పూర్తి చేస్తారా, లేదంటే ‘ఓజీ’ మూవీ అయ్యాకే దానిపై దృష్టి పెడతారా? అనేది తెలియాల్సివుంది. ఓజీ మొదలెట్టే ముందు పవన్ సినిమా కోసం శారీరకంగా కొంత సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. అందుకే సెప్టెంబరు మాసం నుంచే ఆయన మళ్లీ కసరత్తులు మొదలెట్టే అవకాశాలు ఉన్నాయి.
For More Updates Follow The Film Nagar