దేవర విషయంలో జాన్వీ కపూర్‌కు అన్యాయం జరిగిందా?.. ఫస్ట్ సినిమానే తుస్సు మనిపించారా!*
మెట్టినిల్లు నార్త్ అయినా.. పుట్టినిల్లు మాత్రం సౌతే. అసలు శ్రీదేవి సినీ ప్రయాణం స్టార్ట్ అయిందే దక్షిణాదిలో. ఇప్పుడు సీనియర్ నాటి శ్రీదేవి గారాల పట్టి… జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్‌లో పాగా వేయడానికి రెడీ అయిపోయింది.
అందాల తార శ్రీదేవికి దక్షిణాదితో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. మెట్టినిల్లు నార్త్ అయినా.. పుట్టినిల్లు మాత్రం సౌతే. అసలు శ్రీదేవి సినీ ప్రయాణం స్టార్ట్ అయిందే దక్షిణాదిలో. ఆ తర్వాతే బాలీవుడ్‌లో దుమ్మురేపింది. తెలుగులోనూ శ్రీదేవి చాలా హిట్టు సినిమాలు చేసింది.
ఇక ఇప్పుడు శ్రీదేవి గారాల పట్టి… జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్‌లో పాగా వేయడానికి రెడీ అయిపోయింది. ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించనుంది. అందులో మొదట సైన్ చేసిన దేవర సినిమా దసరాకు రిలీజ్ కాగా రెండొది రామ్ చరణ్-బుచ్చిబాబు సనా మూవీ సిద్ధంగా ఉంది.
ఇక రీసెంట్‌గా నాని-శ్రీకాంత్ ఓదెలా సినిమాలో కూడా ఈ బ్యూటీనే కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఇలా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.. అప్పుడే ఈ బ్యూటీ మరో రెండు సినిమాలను లైనప్‌లో పెట్టుకుంది.
ఇక ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నయు దేవర సినిమాలో జాన్వీ తంగం అనే రోల్‌లో నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన జాన్వీ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ దేవర గురించి కొన్ని విషయాలు ప్రక్షకులతో పంచుకున్నారు.
తన క్యారెక్టర్ సెకండ్ పార్ట్‌లో అద్భుతంగా ఉంటుందని, అంతేకాకుండా ఎక్కువ స్కో్ప్ సెకండ్ పార్ట్‌లోనే ఉందని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు పాటల్లో మాత్రమే నటించినట్లు వెళ్లడించింది. ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చింది.
దీన్ని బట్టి చూస్తే.. ఫస్ట్ పార్ట్‌లో పాటల్లో కనిపించినా, సన్నివేశాలు చేసినా పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఉంది మాత్రం సీక్వెల్ లోనే అని క్లారిటీ వచ్చేసింది. సముద్ర తీరానా వీరిద్దరిపై ఓ పాటను గ్రాండ్‌గా తేరక్కెకించడం జరిగింది.
మరోవైపు ఇప్పటికే రిలీజైన ఫియర్ సాంగ్ మాములుగా ఊప లేదు. ఈ మధ్య కాలంలో అలాంటి ట్యూన్ విన్నదే లేదు. అనిరుధ్ ఓ రేంజ్‌లో మ్యూజిక్ ఇచ్చాడు. సెకండ్ సాంగ్ కూడా అదే రేంజ్‌లో ఉండబోతుందని టాక్.
For More Updates: The Film Nagar