కల్కి సీక్వెల్ పార్ట్ టైటిల్ ఫిక్స్ అయినట్టేనా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు లైన్లు కడుతున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాస్తుంది. హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్స్టా లైవ్ లోకి వచ్చి అభిమానులతో పలు విశేషాలను పంచుకున్నారు
ఇదిలా ఉండగా కల్కి పార్ట్-2 కూడా ఉండబోతుందని వారి మాటల ద్వారా తెలిసింది. అయితే, కల్కి పార్ట్-2 కి టైటిల్ పై ఆ లైవ్ లో అభిమానులతో చర్చించారు. కల్కి రెండవ పార్ట్ టైటిల్ అభిమానులు అడగగానే దానికి సమాధానంగా కల్కి సీక్వెల్ పార్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉండాలని ఓ అభిమాని అడగ్గానే ‘కల్కి 3102 BC’ అయితే ఆ సీక్వెల్ పార్ట్ కి పర్ఫెక్ట్ టైటిల్ అని అతడు చెపుకొచ్చాడు. అదే టైంలో మహాభారతం మొదలైంది అని .. శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వీడిన సంవత్సరం అప్పుడేనని.. అప్పుడే కలియుగం ప్రారంభం అయింది అని సదరు అభిమాని చెప్పుకొచ్చాడు
దీనికి నాగ్ అశ్విన్ ఇంప్రెస్ కావడం విశేషం. ఇదిలా ఉండగా, కల్కి పార్ట్-2 సినిమాకు ఈ టైటిల్ పెట్టొచ్చని కొందరు అభిమానులు నెట్టింట ట్వీట్ చేస్తున్నారు. ఏదేమైనా కల్కి మేనియాతో సోషల్ మీడియా ఊగిపోతుంది.