పుష్ప 2 : బన్నీ కష్టం మామూలుగలేదుగా
Icon Staar అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘పుష్ప-2’ షూటింగ్ లో నిమగ్నమై ఉన్నాడు. ‘పుష్ప-1’ కి సీక్వెల్ గా ఈ మూవీ రానున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ఒక లాంగ్ షెడ్యూల్ స్టార్ట్ చేసారు మూవీ టీం
ఈ షెడ్యూల్ ఒక నెలరోజుల పాటు జరగనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు చిత్రంలోని ముఖ్యమైన నటీనటులు పాల్గొంటున్నారట. ప్రస్తుతం ఈ షెడ్యూల్లో ‘పుష్ప-2’ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.
భారీ సెట్ వేసి ఆ సెట్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో పుష్ప-2 చిత్ర షూటింగ్ టాకీ దాదాపుగా పార్ట్ పూర్తవనుంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోండగా విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
For More Updates Follow The Film Nagar