డబ్బులు తీసుకునే అంబానీ పెళ్లికి వెళ్లారా?
ముఖేష్ అంబానీ ఈ పేరు తెలియనివారు ఎవ్వరు ఉండరు ఇప్పుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి గురించే అందరి చర్చ ఎందుకంటే పెళ్లి కి ముందు ఫంక్షన్స్ మొదలుకుని పెళ్లి వరకు ఏ ఫంక్షన్ చేసిన అత్యంత భారీ ఖర్చు తో చరిత్రలో నిలిచిపోయేలా చేసారు ముఖేష్ అంబానీ.
ఇక సెలెబ్రిటీల విషయానికి వస్తే సౌత్ నుండి సూపర్ స్టార్ రజనీకాంత్, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, రానా దగ్గుబాటి అంబానీ పెళ్లికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో నాగార్జున ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు ఇప్ప్పుడు దుమారం రేపుతున్నాయి.ప్రపంచం కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుక ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిళ్లలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. భారతీయ సాంప్రదాయాలన్నీ ఒకే చోట కనిపించేలా ఈ పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ మీడియా మొత్తం ఇప్పుడు అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి గురించే మాట్లాడుతుంది.
సుమారు నాలుగు నుంచి ఐదువేల కోట్ల ఖర్చుతో ఈ పెళ్లి చేస్తున్నాడు ముఖేష్ అంబానీ. తన ఇంట చివరి పెళ్లి కావడంతో చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలనే విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ పెళ్లికి ఇండియన్ సినిమా, క్రీడా సెలబ్రిటీలు సందడి చేశారు. రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు మెరిశారు. సౌత్ నుంచి మహేష్ బాబు, వెంకీ, రామ్ చరణ్, రానా, అలాగే రజనీకాంత్ పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి అందరు రావడంతో మొత్తం సినిమా తారాగణంతో కళకళలాడింది అంబానీ పెళ్లి వేడుక. అందరు దిగ్గజాలు ఒకేచోట కనిపించడంతో చూడ్డానికి అభిమానులకు రెండు కళ్లు సరిపోలేదని చెప్పొచ్చు. ఇలాంటి సందర్భం చాలా అరుదుగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఒకరకంగా అసాధ్యమే. అందుకే ఈ వివాహం చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, ఇలా అన్ని విభాగాల నుంచి ప్రముఖులు పాల్గొని డాన్స్ లు చేశారు. ఆటపాటతో అలరించారు. అతిథులను అలరించారు. ప్రస్తుతం ఆయా ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రజనీకాంత్ కూడా డాన్స్ చేయడం విశేషం.
ఈ సందర్భంలో ఇప్పుడు అక్కినేని నాగార్జున వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నాగ్.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టాక్ షోలో డబ్బున్నొళ్లంతా ఇప్పుడు సినిమా వాళ్ళని డబ్బులిచ్చి మరీ గెస్ట్ లుగా ఆహ్వానిస్తున్నారని, గెస్ట్ గా వస్తే కోట్లు ఆఫర్ చేస్తున్నారని అన్నారు. బాలీవుడ్ లో సెలబ్రిటీలు చాలా వరకు అలానే అటెండ్ అవుతున్నారని, కోట్లల్లో మనీ రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలిపారు. నాగ్ ఏం చెప్పాడంటే.. `పెళ్లిళ్లకి డబ్బులిచ్చి తీసుకొస్తుంటే ఇంకా ఏం చెబుతామండి. మా పెళ్లికి రండి, మేం డబ్బులిస్తాం అంటున్నారు. నేను ఎప్పుడూ వెళ్లలేదు, కానీ ఆ ప్రపోజల్ గురించి నాకు తెలుసు, నన్ను కూడా అడిగారు. గెస్ట్ గా వచ్చి ఓ 20 , 30 నిమిషాలు స్పెండ్ చేసి, ఎంటర్‌టైన్ చేసి వెళ్లిపోండి అని చెబుతున్నారు. ఎంత ఇస్తారనే దానికి లెక్కలేదు, బాలీవుడ్ స్టార్స్ కి కోట్లలో ఇస్తుంటారని, మన వారికి కూడా బాగా ఇస్తారని, అయితే సక్సెస్ ఉంటేనే మన వద్దకు వస్తారని, లేకపోతే పట్టించుకోరు అని అయన తెలిపారు. అలా వెళ్లడంలో తప్పేమి లేదు. వాళ్లేం తప్పు చేయడం లేదు అని ఆయన వెల్లడించారు. ఈ సందర్భం లో నాగ్ వీడియో ని మాత్రం తెగ వైరల్ చేస్తున్నారు.
For more updates: The Film Nagar