రాజమౌళి మహేష్ మూవీ లో విక్రమ్?
రాజమౌళి – మహేష్ బాబు మూవీ కోసం మహేష్ అభిమానులతో పాటు అందరూ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత రాజమౌళి కూడా కొంచెం సమయం తీసుకొని, ఈ ప్రాజెక్ట్ ని షేప్ చేస్తున్నాడు. మహేష్ బాబు తప్ప… మిగిలిన నటీనటుల్ని ఇప్పటి వరకూ ఎవ్వర్నీ ఫైనల్ చేయలేదు మూవీ టీమ్. ఫృథ్వీరాజ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది కానీ దానిపై చిత్రబృందం ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు కదా కనీసం స్పందించలేదు.
అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం విక్రమ్ ని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతి నాయకుడు పాత్ర కోసం ఎప్పుడూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొంటాడు రాజమౌళి. అయితే ఇప్పుడు ఆయన దృష్టి విక్రమ్ పై పడింది. రాజమౌళి నుంచి ఆఫర్ రాగానే…ఎంత నటుడైన ఒప్పుకోవాల్సిందే. అదే రేంజ్ లో నటీ నటులు కూడా అంతే ఆసక్తి చూపిస్తారు రాజమౌళి తో సినిమా చెయ్యడానికి.
కాబట్టి నటుడు విక్రమ్ కూడా ఈ ఆఫర్ కు నో చెప్పే అవకాశం లేదని సమాచారం. సో.. రాజమౌళి మూవీలో మహేష్ కి విలన్ గా విక్రమ్ దాదాపుగా సెట్ అయిపోయినట్టే. ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అన్ని కుదిరితే 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈలోగా మహేష్ మరో సినిమా చేసే అవకాశం లేదు. మహేష్ లుక్ కూడా రివీల్ కాకూడదన్న ఉద్దేశంతోనే రాజమౌళి ఈ కండీషన్ విధించినట్టు తెలుస్తోంది.
For more updates: The Film Nagar