అఖిల్ భవిష్యత్తు… చిరు చేతిలో ఎలాగంటే..?
అఖిల్ సినిమా ‘ఏజెంట్’ 2023లో రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరవాత అఖిల్ సినిమా ఇప్పటివరకు ఏదీ పట్టాలెక్కలేదు. ఇదిలా ఉండగా యూవీ క్రియేషన్స్ లో అఖిల్ ఓ సినిమా చేయాలి. అనిల్ దర్శకుడు. ఈ సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లు వరకు ఉంటుంది. అయితే ఈ కాంబోపై అధికారిక ప్రకటన వచ్చింది. కానీ అప్పటి నుంచీ ఒక్క అప్డేట్ మాత్రం లేదు. ప్రస్తుతం అఖిల్ ఈ పాత్ర కోసం కసరత్తు చేస్తున్నారు, మరోవైపు స్క్రిప్టు పనులు కూడా అవుతున్నట్టు సమాచారం.
యూవీ సంస్థ ప్రస్తుతం ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అధిక మొత్తంలో పెట్టుబడి మొత్తం చిరంజీవి ‘విశ్వంభర’పై పెట్టేసింది. దాదాపు రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న సినిమా అది పైగా సంక్రాంతికి విడుదలకి సిద్ధమౌతోంది. ఆ సినిమాకు సంబంధించిన పనులు అన్నీ పక్కాగా జరిగితే… యూవీ సంస్థ చేతిలో డబ్బులు మిగిలినట్లే. దాంతో అఖిల్ చిత్రం మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే… ‘విశ్వంభర’ బిజినెస్ లావాదేవీలు క్లోజ్ అయ్యేంత వరకూ అఖిల్ సినిమా పెండింగ్ లో ఉంటది. మెగాస్టార్ చిరంజీవి సినిమా, పైగా సోషియో ఫాంటసీ అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న చిత్రం కాబట్టి బయ్యర్లు మొగ్గు చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అటూ ఇటూ అయితే మాత్రం అప్పుడు లెక్కల్లో తేడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా అఖిల్ తదుపరి చిత్రం భవితవ్యం ఇప్పుడు చిరు చేతుల్లో ఉందన్నమాట.
For More Updates: The Film Nagar