సినిమా: కల్కి
తారాగణం:ప్రభాస్,అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొణె,దిశా పటానీ
దర్శకుడు: నాగ్ అశ్విన్
500 కోట్లకి పైగా బడ్జెట్.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు.. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సింపుల్‌గా చెప్పాలంటే ఇదీ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సత్తా. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అద్భుతమైన నటీనటులు, సాంకేతికత, సరికొత్త అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యంత భారీ అంచనాలతో కల్కీ మూవీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది మైథాలజీని సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ ప్రేక్షుకలకి సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన భారీ ప్రయత్నమే ఈ కల్కి 2898. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రానంత హైప్.. కల్కి సినిమాకి వచ్చింది దీనికి ప్రధాన కారణం.. నాగ్ అశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్.. అదే ‘కల్కి’. మరి ఈ సబ్జెక్ట్‌పై నాగ్ అశ్విన్ తీసిన సినిమా గురించి వివరించాలంటే ఒకసారి కల్కి కథలోకి వెళ్లాల్సిందే
ఎవరీ కల్కి?
భారతీయ పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ విశ్వం ప్రమాదంలో పడిన ప్రతీసారి ఒక అవతారం వచ్చి ప్రజలను రక్షిస్తుంది. వాటిలో పది అవతారాలను దశావతరాలుగా ఇప్పటికీ మనం పూజిస్తూనే ఉన్నాం. అలా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన , పరుశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ అవతారాలు.. ఇప్పటికే ముగిశాయి. ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి.
కల్కి 2898 ఏడీలో ఏముంది?
ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా విషయానికొస్తే ఇందులో ప్రధానంగా మూడు రకాల నగరాలను చూపించారు. ఇందులో మొదటి ప్రదేశం ‘కాంప్లెక్స్’.. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి.. ఇక్కడే సుప్రీమ్ (కమల్ హాసన్) ఉంటాడు. తన సైన్యంతో ప్రపంచాన్నే శాసిస్తుంటాడు. ఇక ప్రపంచమంతా వనరులను కోల్పోయిన ‘కాశీ’ పట్టణాన్ని చూపించారు. ఇక మరో ప్రధానమైన నగరం ‘శంబల’. ఇక్కడ సర్వమతాలకు చెందిన శరణార్థులు నివసిస్తూ ఉంటారు. తమని కాపాడేందుకు ఏదో ఒక రోజు ఓ మహా యోధుడు (కల్కి) వస్తాడని వీళ్లంతా నమ్ముతూ ఉంటారు. మరోవైపు కల్కి రాక కోసం ద్వాపర యుగం నుంచీ అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) వేచి చూస్తూ ఉంటాడు.
ఇంకోవైపు ఏం చేసి అయినా సరే అన్నీ వనరులు ఉండే కాంప్లెక్స్‌లో సెటిల్ అయిపోవాలని భైరవ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. మరోవైపు కల్కిని కడుపునా మోస్తున్న సుమతి (దీపికా) ని రక్షిస్తాను అని అశ్వత్థామ మాటిస్తాడు. దీంతో ఆమెను తన దగ్గరికి తీసుకురావాలని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. ఈ విషయంలో సాయం చేస్తే కాంప్లెక్స్‌లోకి అనుమతిస్తామని భైరవకి యాస్కిన్ మనుషులు మాట ఇస్తారు. దీంతో ఎలాగైనా ఆ సుమతిని తీసుకురావాలని భైరవ బయలుదేరతాడు. దీంతో భైరవ- అశ్వత్థామ మధ్య భీకర యుద్ధం జరుగతుంది. మరి ఈ వీళ్లిద్దరిలో ఎవరు గెలిచారు? భైరవ అసలు క్యారెక్టర్ ఏంటి? అసలు కల్కి ఎవరు? యాస్కిన్.. కల్కికి మధ్య యుద్ధం జరిగిందా? ఇవన్నీ సినిమా తెలుసుకోవాల్సిందే. మరి ఈ కల్కి 2898 ఏడీని నాగ్ అశ్విన్ ఎలా తెరకెక్కించారు. ఎవరు ఎలా యాక్ట్ చేశారు తెలుసుకుందాం.
ఎవరెలా చేసారంటే
ప్రభాస్ స్క్రీన్ టైం తక్కువ అయినా తన నటన ఎప్పటిలానే అందరిని మెప్పిస్తుంది మరియు తన కామెడీ టైమింగ్ అందరికి నచుతుంది ఈ సినిమాలో
దీపికా పదుకొనె తన పాత్రకి న్యాయం చేసిందనే చెప్పాలి
అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో చక్కగా ఒదిగిపోయి చక్కని ఎమోషన్స్ పండించారు
కమల్ హాసన్ సుప్రీమ్ పాత్రలో ఇమిడి పోయారు
క్లైమాక్ సీన్స్ సాంకేతికత విషయంలో దర్శకుడు ఎక్కడ రాజీపడలేదు. హాలీవుడ్ కి ఈ మాత్రం తగ్గని యాక్షన్ ఎపిసోడ్స్ తీసాడు దర్శకుడు నాగ్ అశ్విన్
మొత్తానికి కల్కి మూవీ బ్లాక్‌బస్టర్ కొట్టిందనే చెప్పొచ్చు
చివరి మాట: హ్యాట్స్ ఆఫ్ నాగ్ అశ్విన్