ఐ లవ్ పవన్ కళ్యాణ్ సర్ – ధనుష్
‘రాయన్’ (Raayan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నటుడు ధనుష్ (Dhanush). స్వయంగా ఆయనే దర్శకత్వం వహించి హీరోగా కూడా ఆయనే నటించడం విశేషం. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. ఈ వేడుకలో టాలీవుడ్ హీరోల గురించి అడిగిన ప్రశ్నలపై ధనుష్ స్పందించారు.
టాలీవుడ్ హీరోలలో మీ ఫేవరెట్ ఎవరు అని అడగ్గా.. “నేను సమాధానం చెబుతాను. కానీ, మిగితా హీరోల ఫ్యాన్స్ నన్ను హేట్ చేయొద్దు. ఐ లవ్ సినిమా. ఐ లవ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సర్” అని ధనుష్ ఇచ్చిన సమాధానంతో ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లింది. ఒకవేళ మల్టీస్టారర్ మూవీ చెయ్యాల్సి వస్తే మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. వీరిలో ఎవరితో కలిసి నటిస్తారు? అనే ప్రశ్నకు తారక్ (ఎన్టీఆర్) అని బదులిచ్చారు.
For more updates: The Film Nagar