“ఉస్తాద్ భగత్ సింగ్” ఇక లేనట్టేనా..? హరీష్ శంకర్ రిప్లై అదుర్స్..!
ఉస్తాద్ భగత్ సింగ్ ఇక లేనట్టేనా..? హరీష్ శంకర్ రిప్లై అదుర్స్..!
ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్. ఇప్పుడు OG ఉస్తాద్ భగత్ సింగ్ , హరిహర వీర మల్లు లాంటి చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండడంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా పై ఇదిలా ఉండగా పవన్ ఇచ్చిన కొన్ని డేట్స్ లోనే ఒక మాంచి అవుట్ పుట్ ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసాడు హరీష్ శంకర్.
అయితే మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నిలిచిపోయింది అంటూ కొన్ని రూమర్స్ సోషల్ మీడియా లో వైరల్ కాగా ఇప్పుడు వీటిపై హరీష్ శంకర్ ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది. అభిమానులు ఈ సినిమాపై ఓ క్లారిటీ కోసం ఎదురు చూస్తుండగా “సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదు ఇప్పుడు రూమర్స్ చదివే టైం కూడా లేదు” అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి ఆ గాసిప్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పేసాడు. దీనితో తాను ఇచ్చిన రిప్లై ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా అందాల భామ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఉన్న సంగతి తెలిసిందే.
For more updates The Film Nagar